గురువారం 25 ఫిబ్రవరి 2021
Komarambheem - Jan 17, 2021 , 02:21:10

మైనారిటీ ఫంక్షన్‌ హాల్‌ పనులు ప్రారంభించాలి

మైనారిటీ ఫంక్షన్‌ హాల్‌ పనులు ప్రారంభించాలి

  • జడ్పీచైర్‌పర్సన్‌

జైనూర్‌, జనవరి 16 : ప్రభుత్వం ద్వారా జైనూర్‌లో మంజూరైన మైనారిటీ ఫంక్షన్‌హాల్‌ నిర్మా ణ పనులను ప్రారంభించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నా రు. మండల కేంద్రంలోని సర్పంచ్‌ పార్వతి లక్ష్మణ్‌ నివాసంలో శనివారం ఆమె నాయకులతో మాట్లాడారు. ప్రభు త్వం మంజూరు చేస్తున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఇప్పటికే జైనూర్‌లో మైనారిటీ ఫంక్షన్‌హాల్‌ మంజూరై చాలా రోజు లు అవుతున్నప్పటికీ పనులు ప్రారంభించకపోవడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల నాయకులు జడ్పీచైర్‌పర్సన్‌ కోవలక్ష్మిని శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్ర హజ్‌కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల, సహకార సంఘం చైర్మన్‌ కోడప హన్నుపటేల్‌, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు చిర్లె లక్ష్మణ్‌, ఎంపీటీసీ కుమ్ర భగవంత్‌రావ్‌, జుగాదిరావ్‌, సర్పంచ్‌లు మడావి భీంరావ్‌, పార్వతి లక్ష్మణ్‌, కుంర శ్యాంరావ్‌, సిడాం భీంరావ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ గెడాం లక్ష్మణ్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo