శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Komarambheem - Jan 17, 2021 , 02:11:27

తెలంగాణ భవన్‌ త్వరగా పూర్తి చేయాలి

తెలంగాణ భవన్‌ త్వరగా పూర్తి చేయాలి

  • ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, ఎమ్మెల్యే దివాకర్‌రావు
  • నస్పూర్‌లో పనుల పరిశీలన

సీసీసీ నస్పూర్‌, జనవరి 16 : నస్పూర్‌లో జిల్లా తెలంగాణ భవన్‌ పేరుతో నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని శనివారం ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రా వు పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న చిన్న చిన్న పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. వారు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం సూచనల తో త్వరలోనే కార్యాలయ భవనాన్ని ప్రారంభి స్తా మని చెప్పారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈసంపల్లి ప్రభాకర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్లు జబీన్‌హైమద్‌, కుర్మిళ్ల అన్నపూర్ణ, బం డి పద్మ, బోయ మల్లయ్య, చిడం మహేశ్‌, మర్రి మొగిలి, పంబాల గంగా, బెడికే లక్ష్మి, కోఆప్షన్‌ సభ్యులు ముత్తె రాజేశం, నాసర్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ గర్శె భీమయ్య, కమలాకర్‌రావు, ఖాలీద్‌, పెరుమాళ్ల జనార్దన్‌, ఇరికిళ్ల పురుషోత్తం, దగ్గుల మధు, కాటం రాజు, రౌతు రజిత, పంబాల ఎర్ర య్య, చెల్ల విక్రమ్‌, రవిగౌడ్‌ పాల్గొన్నారు. 

రాజీవ్‌నగర్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

మంచిర్యాలటౌన్‌, జనవరి 16 : రాజీవ్‌నగర్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని ఒకటోవార్డు (రాజీవ్‌నగర్‌)లో రూ. 6 లక్షలతో నిర్మించిన మెటల్‌రోడ్డు, సిమెంట్‌ రో డ్డు, రూ. 3 లక్షలతో నిర్మించిన డ్రైనేజీలను ఎమ్మె ల్యే ప్రారంభించారు. కౌన్సిలర్‌ బుద్దార్థి సత్తమ్మ, హరికృష్ణ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు బుద్దార్థి రాంచందర్‌, బగ్గని రవికుమార్‌, శ్రీపతి శ్రీనివాస్‌, లెక్కల శ్రీనివాస్‌, స్వామి, శంకర్‌, వెంకటేశ్‌, రాజేశ్‌ పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

మంచిర్యాలటౌన్‌(శ్రీరాంపూర్‌), జనవరి 16 : నస్పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని ఆరో వార్డు ఆర్కే 8కాలనీకి చెందిన గాధర్ల శ్రీకాంత్‌కు మంజూరైన రూ. 2 లక్షల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును ఎమ్మె ల్యే నడిపెల్లి దివాకర్‌రావు అందజేశారు. నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావు, కౌన్సిలర్‌ పూదరికుమార్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo