బుధవారం 27 జనవరి 2021
Komarambheem - Jan 14, 2021 , 00:53:31

నిరుపేదల సంక్షేమానికి కృషి

నిరుపేదల సంక్షేమానికి కృషి

ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌

కోటపల్లి, జనవరి 13 : నిరుపేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఆయన నివాసంలో 9 మందికి రూ.3.52 లక్షల విలువ గల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్నదన్నారు. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి ఆసరాగా ఉందని పేర్కొన్నారు. ఇందులో కోటపల్లికి చెందిన మల్లయ్యకు రూ.15వేలు, చెన్నూర్‌కు చెందిన సీహెచ్‌ వెంకటేశ్‌కు రూ.44వేలు, మధూకర్‌కు రూ.30వేలు, పుల్లయ్యకు రూ.60వేలు, రాజంకు రూ.48వేలు, భీమారం గ్రామానికి చెందిన దామోదర్‌కు రూ.20వేలు, కిష్టంపేటకు చెందిన సుమలతకు రూ.60వేలు, సుందరశాలకు చెందిన సురేఖకు రూ.15 వేల విలువైన చెక్కులను అందజేశారు. చెన్నూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అర్చన రాంలాల్‌ గిల్డా, కౌన్సిలర్లు జోడు శంకర్‌, తుమ్మ రమేశ్‌, మాజీ సర్పంచ్‌ సాధనబోయిన కృష్ణ, నాయకులు గట్టాగౌడ్‌, బైస రాజన్న, వెంకటరాజం, బాపు పాల్గొన్నారు.


logo