16న వ్యాక్సినేషన్

‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో డీఎంహెచ్‌వో కుమ్రం బాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 13, నమస్తే తెలంగాణ : ఈ నెల 16న జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ నిర్వహించనున్నట్లు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు పేర్కొన్నారు. బుధవారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించారు.
నమస్తే : జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ?
డీఎంహెచ్‌వో : జిల్లాలో ఇప్పటికే డ్రైరన్ నిర్వహించాం. ఇది విజయవంతమైంది. 16న జిల్లాలో వ్యాక్సినేషన్ నిర్వహించనున్నాం. ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ దవాఖాన, కాగజ్‌నగర్ పట్టణంలోని ఏరియా హాస్పిటల్, సర్‌సిల్క్ పీహెచ్సీలో వైద్య సిబ్బందికి టీకా వేస్తాం. ప్రతి దవాఖానలో 30 మందికి వ్యాక్సిన్ ఇస్తాం.
నమస్తే : అన్ని పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
డీఎంహెచ్‌వో : ఈ నెల 18వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. మొదట వైద్య సిబ్బందికి వేయాలని గైడ్‌లైన్స్ ఉన్నాయి.
నమస్తే : వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి?
డీఎంహెచ్‌వో : కరోనా వ్యాక్సినేషన్ కోసం ముందుగానే మైక్రోప్లాన్ సిద్ధం చేశాము. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో సుమారు 3,500 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. వీరందరినీ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించి మొదటి టీకా వారికి వేయాలని మాకు గైడ్‌లైన్స్ ఉన్నాయి. దీని ప్రకారమే ముందుకు వెళ్తున్నాం.
నమస్తే : పీహెచ్‌సీల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
డీఎంహెచ్‌వో : ఈ నెల 18 నుంచి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. మొదట వైద్య సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తాం. ప్రతి పీహెచ్సీలో వ్యాక్సిన్ నిల్వ చేసేందుకు ఐఎల్ఆర్లు ఉన్నాయి.
తాజావార్తలు
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్‌తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- పెట్రోల్ మంట: భారత విజ్ఞప్తిని పట్టించుకోని సౌదీ అరేబియా
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్‌కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్
- జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు.. 53 మరణాలు