గురువారం 04 మార్చి 2021
Komarambheem - Jan 13, 2021 , 01:49:32

కొనసాగుతున్న పారిశుధ్య పనులు

కొనసాగుతున్న పారిశుధ్య పనులు

  • 20 నుంచి డిగ్రీ పీజీ పరీక్షలు

రెబ్బెన, జనవరి12 : ఈ నెల 20 నుంచి కాకతీయ విశ్వ విద్యాలయం దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించనున్నట్లు రెబ్బెన ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎంఏ జాకీర్‌ ఉస్మానీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ప్రథమ, పీజీ ద్వితీయ  సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కాగజ్‌నగర్‌టౌన్‌, జనవరి 12 : పట్టణంలో ప్రత్యేక పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. సర్‌సిల్క్‌లోని వార్డు నంబర్‌-4లోని సుభాష్‌చంద్రబోస్‌ కాలనీలో పారిశుధ్య పనులను మంగళవారం మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ పరిశీలించారు. కౌన్సిలర్‌ వంగరి సాగరిక, మున్సిపల్‌ అధికారులు శ్రీనివాస్‌, ఆర్పీ సిబ్బంది ఉన్నారు. 

VIDEOS

logo