Komarambheem
- Jan 13, 2021 , 01:42:10
VIDEOS
అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రాణహిత జలాలు, మట్టి సేకరణ

కోటపల్లి, జనవరి 12 : అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట సమీపంలోని ప్రాణహిత నది నుంచి పవిత్ర జలాలు, మట్టిని సేకరించారు. ఈ సందర్భంగా శృంగేరి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి, విధిశేఖర భారతీ మహాస్వామి ఆశీర్వచనాలతో శృంగేరి పీఠాధిపతి బ్రహ్మజ్ఞ గట్టు నరహరి అవధాని నేతృత్వంలో నది వద్ద మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జలాలు, మట్టిని సేకరించారు. దేశంలోని 16 ప్రముఖ నదుల నుంచి జలాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోని ప్రాణహిత, చెన్నూర్‌లోని పంచక్రోశ ఉత్తర వాహిన నుంచి సేకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ విజ్ఞాన యూనివర్సిటీ ప్రిన్సిపల్, శృంగేరి వేద పండితులు కుప్ప శివ సుబ్రహ్మణ్య అవధాని, పండితులు మహేశ్వర్, దత్తు, సర్పంచ్ గుర్రం లక్ష్మి, రైతు బంధు మండల కన్వీనర్ గుర్రం రాజన్న పాల్గొన్నారు.
తాజావార్తలు
- మతసామరస్యానికి ప్రతీకగా ఉర్సు
- పాలమూరు కోడలిని ఆశీర్వదించండి
- ‘ప్రగతి’ పనుల్లో జిల్లా ముందుండాలి
- విరాట్ @100 మిలియన్ల ఫాలోవర్స్
- బెంగాల్ మంత్రుల కోడ్ ఉల్లంఘన: ఈసీకి బీజేపీ లేఖ
- బెంగాల్ పొత్తులు నెహ్రూ-గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకం
- ఎన్ఎస్ఈలో లోపం అనూహ్యం.. బట్!
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల బిడ్లు!
MOST READ
TRENDING