క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది

- ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
- క్రికెట్ పోటీలు ప్రారంభం
- ఎస్పీఎం క్రీడా మైదానంలో ఎమ్మెల్యే, రామకృష్ణాపూర్లో ముంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి..
- కోటపల్లిలో విజేతలకు ఎమ్మెల్సీ పురాణం బహుమతుల ప్రదానం
కాగజ్‌నగర్‌టౌన్, జనవరి 12 : క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. స్థానిక ఎస్పీఎం క్రీడా మైదానంలో న్యూఎరా, ఎంఎంసీసీ క్రికెట్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాగజ్‌నగర్ గోల్డెన్ కప్ ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాగజ్‌నగర్ ఎస్పీఎం క్రీడామైదానానికి ఎంతో చరిత్ర ఉందని, ఈ ప్రాంతం నుంచి చాలా మంది క్రీడాకారులు జాతీయ, రాష్ట్రస్థాయిల్లో రాణించారని గుర్తుచేశారు. అనంతరం ఎస్పీఎం సీఈవో, డైరెక్టర్ పవన్‌కుమార్ సూరి మాట్లాడుతూ.. టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడాలన్నారు. అంతకుముందు ప్రముఖులు, క్రీడాకారులతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్, జల్గావ్, బల్లార్షా, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, సిద్ధిపేట, కాగజ్‌నగర్‌తో పాటు టీసీఏ జట్లు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, ఎస్పీఎం డీజీఎం రమేశ్‌రావు, అడ్వకేట్ కిశోర్, కౌన్సిలర్లు శివప్రసాద్, బంక శివ, సునీల్, న్యూఎరా మరియు ఎంసీసీ క్రికెట్ క్లబ్ నిర్వాహకులు మినాజ్, రఫీ, సలీం, పండునాయక్, సుదర్శన్, యూసుఫ్, యూఎన్ చారి పాల్గొన్నారు.
పోటీలు ప్రారంభించిన జడ్పీ చైర్పర్సన్..
రామకృష్ణాపూర్, జనవరి 12 : రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్ స్టేడియంలో తెలంగాణ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీని మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మె ల్యే ఓదెలు ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్‌రెడ్డి, కమిషనర్ వెంకటనారాయణ, మేనేజర్ కీర్తి నాగరాజు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు కంభగోని సుదర్శన్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ అజీజ్, బీ నర్సింగరావు, జీ సమ్మయ్య, నీలం శ్రీనివాస్‌గౌడ్, జే కుమార్, యువజన, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.
విజేతలకు బహుమతుల ప్రదానం..
కోటపల్లి, జనవరి 12 : మండలంలోని మల్లంపేటలో నిర్వహించిన కోటపల్లి, వేమనపల్లి మండలాల స్థాయి క్రికెట్ టోర్నీ విజేతలకు ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. కేతనపల్లి, రొయ్యలపల్లి జట్లు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి సురేఖ, వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్‌రావ్, పీఏసీఎస్ చైర్మన్ సాంబాగౌడ్, సర్పంచ్ అక్కల మధూకర్, కుమ్మరి సంతోష్, ఎంపీటీసీ జేక శేఖర్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బైస ప్రభాకర్, నియోజకవర్గ కోఆర్డినేటర్ ముల్కల్ల శశిపాల్ రెడ్డి, నిర్వాహకలు గారె రమేశ్, పోగుల రమేశ్, చిలకమారి మహేందర్ పాల్గొన్నారు.