ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- ప్రభుత్వ విప్ బాల్క సుమన్
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
- చెన్నూర్ పట్టణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
చెన్నూర్, జనవరి 7: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కొనియాడారు. చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలోని 39 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.11,87,000 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సర్కారు దవాఖానలను ప్రభుత్వం అభివృద్ధి చేసి, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని తెలిపారు. ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకున్న పేదలను సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నదని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటివరకూ వందలాది మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నామని తెలిపారు.
రూ 96లక్షలతో అభివృద్ధి పనులకు శంకు స్థాపన
చెన్నూర్ పట్టణంలోని దుబ్బగూడెం, నల్లగొండ పోచమ్మ వాడ, ఇందిరానగర్, మారెమ్మవాడల్లో ఎస్సీ సబ్ స్లాబ్ నిధులు రూ.96లక్షలతో చేపట్టే సిమెంట్ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, మున్సిపాలిటీ నిధులు రూ. 3లక్షలతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యుత్ దీపాల ఏర్పాటు పనులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూర్ పట్టణంలో అన్ని కాలనీల్లో సిమెంట్ రోడ్లు, మురుగు కాలువలను నిర్మించనున్నట్లు తెలిపారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
రహదారుల నిర్మాణాలను వేగవంతం చేయాలి
చెన్నూర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న రహదారులు, వంతెనల నిర్మాణాలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ, రోడ్డు భవనాలశాఖ ఇంజినీరింగ్ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రహదారులు, వంతెనల నిర్మాణం పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల నిర్వహణలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, మున్సిపాలిటీ చైర్మన్ అర్చనా గిల్డా, వైస్ చైర్మన్ నవాజొద్దీన్, చెన్నూర్ ఎంపీపీ మంత్రి బాపు, చెన్నూర్ జడ్పీటీసీ మోతె తిరుపతి, చెన్నూర్ వైస్ ఎంపీపీ బాపురెడ్డి, కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ, కోటపల్లి వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్‌రావు, చెన్నూర్, కోటపల్లి సహకార సంఘాల అధ్యక్షుడు చల్ల రాంరెడ్డి, పీ సాంబగౌడ్, చెన్నూర్, కోటపల్లి మండలాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లెల దామోదర్‌రెడ్డి, బైస ప్రభాకర్, కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్, జగన్నాథుల శ్రీనివాస్, తుమ్మ రమేశ్, వేల్పుల సుధాకర్, పెండ్యాల స్వర్ణలత, నసీమాబేగం, జాడి సురేఖ, కో-ఆప్షన్ సభ్యులు అయూబ్, టీఆర్ఎస్ నాయకులు రాంలాల్ గిల్డా, నాయిని సతీశ్, జాడి తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు, తదితరులున్నారు.
తాజావార్తలు
- ఆన్లైన్లో భద్రాద్రి రామయ్య కల్యాణం టికెట్లు
- ఇక స్కూళ్లల్లోనూ ఇంటర్ పరీక్ష కేంద్రాలు
- లాస్యతో కుమార్ సాయి స్టెప్పులు... వీడియో వైరల్
- తిరుపతి మార్గంలో 18 రైళ్లు రద్దు: ఎస్సీఆర్
- పదేండ్ల తర్వాత టీటీడీ కల్యాణమస్తు
- నేడు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ.. తొలి విడత అభ్యర్థుల ప్రకటన!
- స్నేహితురాలి పెళ్లిలో తమన్నా సందడి మాములుగా లేదు
- బ్లాక్ డ్రెస్‌లో రాశీ ఖన్నా గ్లామర్ షో అదిరింది...!
- ‘మోదీ ఫొటోలను తొలగించండి’
- బిల్డింగ్‌పై నుండి కింద పడ్డ నటుడు.. ఆసుపత్రికి తరలింపు