గురువారం 04 మార్చి 2021
Komarambheem - Dec 24, 2020 , 00:15:07

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

  • పరిశుభ్రత అందరి బాధ్యత
  • కుమ్రం భీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ 

చింతలమానేపల్లి : పల్లెలను ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కుమ్రం భీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో బుధవారం మండల అధికారులు, ప్రజాప్రతినిధులకు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, తడిచెత్త నుంచి సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెల అభివృద్ధిలో భాగంగా పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, శ్మశానవాటికలు, కల్లాలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, నర్సరీలను ప్రభుత్వం మంజూరుచేసిందన్నారు. ప్రకృతి వనాల్లో మూడు రకాల మొక్కలను పెంచాలని, పచ్చదనంతో ప్రకృతి వనాలు ఆహ్లాదకరంగా మారుతాయని తెలిపారు. తడిచెత్త ద్వారా ఎరువు తయారీ చేసి, ప్రకృతి వనాలకు హరితహారం మొక్కలకు వాడాలని సూచించారు. మహిళా సంఘాలు, సర్పంచ్‌లు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అనంతరం ఎంపీపీ డుబ్బుల నానయ్య మాట్లాడుతూ.. మండలంలో పలు సమస్యలు ఉన్నాయన్నారు. వాటిని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రవీంద్రనగర్‌లోని పల్లె ప్రకృతి వనం స్థలాన్ని అధికారులతో కలిసి కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్‌ బికర్ణదాస్‌, ఎంపీడీవో కుటుంబరావు, ఎంపీపీ డుబ్బుల నానయ్య, జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, అధికారులు, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo