మంగళవారం 26 జనవరి 2021
Komarambheem - Dec 06, 2020 , 02:08:36

అర్హులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

అర్హులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

  •    కుమ్రం భీం ఆసిఫాబాద్‌ అదనపు కలెక్టర్‌ రాంబాబు

దహెగాం : అర్హులై ఉండి ఓటరు జాబితాలో పేరు లేని వారు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆసిఫాబాద్‌ అదనపు కలెక్టర్‌ రాంబాబు సూచించారు. మండలకేంద్రంలోని ఓటు హక్కు నమోదు కేంద్రాన్ని శనివా రం సందర్శించారు. ఓటర్ల జాబితాలో ఏ విధంగా తయారు చేస్తున్నారని అడి గి తెలుసుకున్నారు. 20 21, జనవరి 21 నాటికి 18 ఏండ్లు నిండిన యువ తీ యువకులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  అనంత రం పల్లె ప్రకృతి వనం, నిర్మాణంలో ఉన్న రైతు వేదికను పరిశీలించారు.  రైతు వేదిక నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతతో పూర్తి చేయాలని తెలిపారు. దహెగాం, లగ్గాం గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కా ర్యక్రమంలో డీసీవో స్వామికుమార్‌, తహసీల్దార్‌ రామ్మోహన్‌, ఎంపీడీవో సత్యనారాయణ, ఏఈ ఆత్మారాం, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

ఓటరు నమోదు పకడ్బందీగా చేపట్టాలి : డీఆర్వో

రెబ్బెన : ఓటరు నమోదు ప్రక్రియను బూత్‌ లెవల్‌ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కదం సురేశ్‌ పేర్కొన్నారు. రెబ్బెన మండలంలోని రెబ్బెన, పులికుంట, గోలేటి, కైర్‌గాం గ్రామాల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను శనివారం ఆయన సందర్శించారు.  ఆయన వెంట రెబ్బెన తహసీల్దార్‌ రియాజ్‌అలీ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.


logo