సోమవారం 18 జనవరి 2021
Komarambheem - Dec 05, 2020 , 06:42:39

ఐకే ఓసీని సందర్శించిన డైరెక్టర్‌

ఐకే ఓసీని సందర్శించిన డైరెక్టర్‌

జైపూర్‌ : శ్రీరాంపూర్‌ డివిజన్‌లోని ఇందారం ఓపెన్‌కాస్టు గనిని శుక్రవారం సాయంత్రం సింగరేణి డైరెక్టర్‌ ఫైనాన్స్‌ బలరాం సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్పత్తికి సంబంధించిన వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓపెన్‌కాస్టు గని గోదావరికి సమీపంలో ఉన్నందున రక్షణ చర్యలు పకడ్బందీగా ఉండాలని తెలిపారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని సూచించారు. బొగ్గును తరలించే ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజూ ఓబీ మట్టి తీస్తున్న వివరాలు, బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ప్రతి కార్మికుడూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని సూచించారు. డైరెక్టర్‌ వెంట  జీఎం ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్లానింగ్‌ రమేశ్‌రావు, శ్రీరాంపూర్‌ జీఎం లక్ష్మీనారాయణ, ఓసీ పీవో రాజేశ్వర్‌రెడ్డి, గని మేనేజర్‌ ఉమాకాంత్‌, ఇంజినీర్‌ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.