Komarambheem
- Dec 03, 2020 , 00:42:45
బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

- రాష్ట్ర కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మెంబర్ దేవయ్య
కాగజ్‌నగర్ రూరల్ : బాలల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మెంబర్ ఏ దేవయ్య అన్నారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బాలల సంరక్షణకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, పథకాల అమలు, తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో చర్చించేందుకు వచ్చామన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ఐసీడీఎస్, పోలీస్, వైద్య, విద్య, తదితర శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి కాగజ్‌నగర్‌కు రైలులో చేరుకున్న ఆయనకు, తహసీల్దార్ ప్రమోద్‌కుమార్, ఐసీడీఎస్ అధికారి సావిత్రి పుష్పగుచ్ఛం అందించి, స్వాగతం పలికారు. వీరి వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్, విజయ్, మహేష్, ఏఎస్ఐ గబ్బర్, భాస్కర్ తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- చెన్నైలోనే ఐపీఎల్ -2021 వేలం!
- వాట్సాప్ కు ధీటుగా సిగ్నల్ ఫీచర్స్...!
- పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం : మంత్రి కేటీఆర్
- ఇక మొబైల్లోనే ఓటరు గుర్తింపు కార్డు
- ఎయిర్‌పోర్ట్‌లో రానా, మిహీక
- చిరుతను చంపి.. వండుకుని తిన్న ఐదుగురు అరెస్ట్
- పాయువుల్లో బంగారం.. పట్టుబడ్డ 9 మంది ప్రయాణికులు
- వాళ్లను చూస్తే కాజల్‌కు మంటపుడుతుందట..
- జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల
- పది మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ చార్జిషీట్
MOST READ
TRENDING