ఆదివారం 17 జనవరి 2021
Komarambheem - Dec 02, 2020 , 01:16:11

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి

  • ఆసిఫాబాద్‌ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌ యాదవ్‌
  • ఎంపీడీవో కార్యాలయంలో మండల సమావేశం
  •  హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు

ఆసిఫాబాద్‌ :  ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌యాదవ్‌ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారు లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ పల్లెల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మండలంలోని రోడ్లను మాడిఫికేషన్‌ చేసే ముందు తమ దృష్టికి ఎందుకు తీసుకురావడం లేదని పీఆర్‌ ఏఈని ప్రశ్నించారు. రూర్బన్‌ నిధులు సక్రమంగా ఖర్చు చేయడం లేదని, రహపల్లిలో రోడ్డు పనుల కోసం గుంత తవ్వి  వదిలిపెట్టడంతో ఇటీవల ఒకరు అందులో పడి తీవ్రంగా గాయపడ్డారని, పనులు చేస్తేనే ప్రారంభించాలని ఏఈకి సూచించా రు. గ్రామాల్లో స్వయం సహయక సంఘాల ఏర్పాటు కోసం స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీల సహాకారం తీసుకోవాలని ఏ పీఎం శ్రీనివాస్‌కు సూచించారు. 

కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసి ఉన్నాయని ఎక్కడైనా స్కూళ్లలో భవనాలు, ప్రహరీలు, తదితర పనుల కోసం అంచనా వేయించాలని విద్యాశాఖ అధికారికి సూచించారు. మండలంలోని కల్లాలు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు తదితర పనులు వేగవంతం చేసి వినియోగంలోకి వచ్చేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గాదెవేణి మల్లేశ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ అలీబీన్‌ హైమద్‌, వైస్‌ ఎం పీపీ సుంకరి మంగ, ఎంపీడీవో శశికళ, ఎంపీవో ప్రసాద్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.