శుక్రవారం 05 మార్చి 2021
Komarambheem - Nov 30, 2020 , 06:09:25

మున్సిపల్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు

మున్సిపల్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు

చెన్నూర్‌ : పట్టణంలో మున్సిపల్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య  పను లు కొనసాగుతున్నాయి. పలు వాడల్లో ఆదివారం మురుగు కాలువల్లోని పూడకతీతను తొలగించారు. రోడ్లపై ఉన్న చెత్త, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. పూడికతీత, చెత్తను ట్రాక్టర్ల ద్వారా డంప్‌ యార్డులకు తరలించారు. పనులను మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌ పర్యవేక్షించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయవద్దని ఆయన కోరారు.

తాండూర్‌ : ఆయా గ్రామాల్లో కార్మికులు పారిశుధ్య పనులు చేపట్టారు. రోడ్లు, మురుగు కాలువలను శుభ్రం చేశారు. బావుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. దోమల నివారణకు మందు పిచికారీ చేయించారు. తాండూర్‌ గ్రామ పరిధిలోని రాంనగర్‌లో ఇన్‌చార్జి సర్పంచ్‌ పూదరి నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది మురుగు కాలువలను శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి ట్రాక్టర్ల ద్వారా డంప్‌ యార్డుకు తరలించారు. 


VIDEOS

logo