మంగళవారం 19 జనవరి 2021
Komarambheem - Nov 29, 2020 , 00:39:30

నిధులున్నా నిష్ఫలం

నిధులున్నా నిష్ఫలం

  •  రూ.184.21 కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులతో 2,312 పనులు
  • అధికారుల నిర్లక్ష్యంలో ముందుకు సాగని పనులు
  •  డిసెంబర్‌ 31లోపు పూర్తి చేయాలని  కలెక్టర్‌ ఆదేశం

సింగరేణి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం యాజమాన్యం నిధులు మంజూరు చేస్తున్నది. రెండేండ్ల క్రితం డీఎంఎఫ్‌టీ ద్వారా రూ.184.21 కోట్లు విడుదలయ్యాయి. ఈ డబ్బులతో రహదారులు, మురుగు కాలువలు, నీటి వసతి వంటి మౌలిక వసతులు కల్పించాలి. పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, గిరిజన ఇంజినీరింగ్‌ సంక్షేమ శాఖలు పనులు నిర్వహిస్తున్నాయి. ఈ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదు. తాజాగా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి.. డిసెంబర్‌ 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

 కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాకు సింగరేణి డీఎంఎఫ్‌టీ(డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ ట్రస్ట్‌) ద్వారా రూ.184.21 కోట్లు మంజూరు చేసిం ది. ఈ నిధులతో సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, మురుగు కాలువలు, నీటి వసతి వంటి మౌలిక వసతులు కల్పించాలి. పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, గిరిజన ఇంజినీరింగ్‌ సంక్షేమ శాఖలు పనులు నిర్వహిస్తున్నా యి. తిర్యాణి, గోలేటి మండలాలతోపాటు పలు ప్రాం తా ల్లో పనులు జరుగుతున్నాయి. అధికారుల అలసత్వం వల్ల పనులు ముందుకు సాగడం లేదు.

రూ.184.21 కోట్లలో ఖర్చు చేసినవి రూ.36.58 కోట్లే.. 

డీఎంఎఫ్‌టీ నిధులు రెండేండ్ల క్రితం మంజూరు కాగా.. వీటి తో 2,312 పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటి వరకు రూ.63.58 కోట్లతో 1,3 42 పనులు పూర్తి చేశారు. ఇంకా.. రూ.120.63 కోట్లతో 970 పనులు చేయాల్సి ఉంది. ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా రూ. 3.68 కోట్లతో 197, పంచాయతీరాజ్‌ ద్వారా రూ. 62.45 కోట్లతో 634 పనులు చేపట్టాలి. మిగతా నిధులతో వివిధ శాఖల ద్వారా జిల్లావ్యాప్తంగా పనులు నిర్వహించాలి.