యువకులు ప్రయోజకులవ్వాలి

- కుమ్రం భీం ఆసిఫాబాద్ ఏఎస్పీ సుధీంద్ర
- కంచన్‌పల్లిలో గ్రంథాలయం ప్రారంభం
లింగాపూర్ : యువకులు చదువుల్లో రాణిస్తూ సమాజ ప్రయోజకులుగా ఎదగాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఏఎస్పీ సుధీంద్ర పిలుపునిచ్చారు. ‘పోలీసులు మీ కోసం’లో భాగంగా కంచన్‌పల్లిలో జైనూర్ సర్కిల్ పోలీసులు ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్‌పై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వ్యసనాలకు గురికాకుండా చదువుపై దృష్టిపెట్టేలా చూడాలని తెలిపారు. విద్యారంగంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు గ్రంథాలయంలో మంచి పుస్తకాలను అందుబాటులో ఉంచడంపై ఏఎస్పీ హర్షం వ్యక్తం చేశారు. నేటి బాలలే రేపటి పౌరులని, రాబోయే కాలంలో దేశం నేటి యువతపైనే ఆధారపడి ఉందన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ విద్య, క్రీడారంగాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అనంతరం స్థానికులు ఏఎస్పీకి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అచ్చేశ్వర్‌రావ్, సీఐ హనూక్, సర్పంచ్ జ్యోతీరాం, భీంరావ్, శేకు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆ పరిస్థితి ఎవరికీ రావొద్దు!
- నేడు మంత్రి కేటీఆర్ పర్యటన
- రాంభీమ్ పోరుపథం
- 3.1 సెకన్లలో 96 కి.మీ స్పీడ్.. మార్చిలో భారత్‌లోకి టెస్లా మోడల్-3!
- ఆదిపురుష్ ప్రపంచంలోకి..
- వెండితెరకు కథలు రాద్దాం
- దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు
- ఆ మాటకు వాళ్లు అర్హులు కాదు!
- బాధితురాలికి ఎమ్మెల్యే షిండే పరామర్శ
- పల్లెప్రగతి పనులను వందశాతం పూర్తిచేయాలి