మున్సిపల్ అభివృద్ధికి చర్యలు

- అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించాలి
- ప్రత్యేక ప్రణాళికతో పన్నులు వసూలు చేయాలి
- కాగజ్నగర్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి
- చెత్త వాహనాల వినియోగంపై దృష్టిపెట్టాలి
- కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్
కాగజ్నగర్టౌన్ : కాగజ్నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని అధికారులను కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులతో శనివారం ఆయన మాట్లాడారు.
పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించి, మున్సిపాలిటీ అభివృద్ధికి చర్యలను వేగవంతం చేయాలన్నారు. ప్రత్యేక ప్రణాళిక ద్వారా వందశాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. పట్టణాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా చెత్త వాహనాల వినియోగంపై దృష్టిపెట్టి, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. మున్సిపల్ ఆవరణలో చేపడుతున్న ఎరువుల తయారీ పనులను పరిశీలించారు. పట్టణంలో సేకరించిన తడి చెత్తతో మూడు స్టేజీల్లో ఎరువు తయారు చేసి, హరితహారం మొక్కలకు వినియోగిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కలెక్టర్కు వివరించారు. అంతకుముందు మున్సిపల్ సమావేశ మందిరం, పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. మెప్మా సిబ్బంది ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో అందిస్తున్న మందుల వివరాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అలాగే తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని మెప్మా సభ్యులకు సూచించారు. అనంతరం మార్కెట్ యార్డు సమీపంలో రోడ్డును ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ వెంట మున్సిపల్ అధికారులు శ్రీనివాస్, రఫీక్, శ్రీనివాస్, బాపు, సతీశ్, ప్రణిల్, రాజేశ్, అఖిల్, మెప్మా సిబ్బంది మోతీరాం, ఉషారాణి ఉన్నారు.
తాజావార్తలు
- సినీ ప్రముఖులకు జగపతి బాబు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్
- సిమ్ స్వాపింగ్.. ఖాతాలు లూటీ
- సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు
- మద్య నిషేధం విధించండి.. బీజేపీ చీఫ్ నడ్డాకు ఉమాభారతి విజ్ఞప్తి
- రాష్ర్టంలో క్రమంగా వేడెక్కుతున్న వాతావరణం
- రూ.2.15లక్షలకే స్విఫ్ట్ డిజైర్ అంటూ బురిడీ
- రూ.50 జరిమానా సరిపోదు, కఠినంగా శిక్షించాలి: శ్రద్ధా
- సాక్ష్యం గెలిచింది
- సింగరేణిలో 372 పోస్టులు
- కత్తితో పొడిచి.. గొంతు కోశాడు