శనివారం 23 జనవరి 2021
Komarambheem - Nov 28, 2020 , 00:48:01

ఆన్‌లైన్‌ తరగతులు వినియోగించుకోవాలి

ఆన్‌లైన్‌ తరగతులు వినియోగించుకోవాలి

ఆసిఫాబాద్‌ టౌన్‌ : ఆన్‌లైన్‌ తరగతులను వినియోగించుకోవాలని ఆసిఫాబాద్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ నరేందర్‌ విద్యార్థులకు సూచించారు. మండలంలోని అంకుసాపూర్‌ గ్రామంలో ‘మన ఊరు మన గురుకులం’ కార్యక్రమాన్ని  శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవి డ్‌ దృష్ట్యా ప్రభుత్వం ఆన్‌లైన్‌ త రగతులు నిర్వహిస్తున్నదని, తల్లిదండ్రులు తమ పిల్లలు వినేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీయూపీఎస్‌ ప్రధానోపాధ్యాయుడు రమేశ్‌, ఉ పాధ్యాయులు ఉపేందర్‌, రహీం, పండిత్‌, శంకర్‌, ఉపేందర్‌ గౌడ్‌, చైతన్య తదితరులున్నారు.

తాజావార్తలు


logo