ఆదివారం 17 జనవరి 2021
Komarambheem - Nov 28, 2020 , 00:48:08

ధ్రువీకరణ పత్రాల పరిశీలన

ధ్రువీకరణ పత్రాల పరిశీలన

ఆసిఫాబాద్‌ టౌన్‌ : గిరిజన సంక్షేమ శాఖ, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ట్రైకార్‌ పథకం (డ్రైవర్‌ ఎంపవర్మెంట్‌) కింద 2016-17లో మిగిలిన యూనిట్లకు గాను శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిజన అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయంలో ఐటీడీఏ పీవో భవేశ్‌ మిశ్రా అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. 60 మంది దరఖాస్తు చేసుకోగా, 43 మంది హాజరైనట్లు డీటీడీవో దిలీప్‌ కుమార్‌ తెలిపారు. సహాయ సమీకృత గిరిజన అభివృద్ధి శాఖ అధికారి భీంరావ్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ చెంచు రామయ్య తదితరులు పాల్గొన్నారు.