ఆదివారం 17 జనవరి 2021
Komarambheem - Nov 27, 2020 , 00:30:41

పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు

పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు

  • కుమ్రం భీం ఆసిఫాబాద్‌ అదనపు కలెక్టర్‌ రాంబాబు

ఆసిఫాబాద్‌ : ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతున్నదని కుమ్రం భీం ఆసిఫాబాద్‌ అదనపు కలెక్టర్‌ రాంబాబు అన్నారు. సంబంధిత అధికారులతో గురువారం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో మూడురోజుల ముందుగా నమోదు చేయాలని, నాలుగోరోజు డీఎం కార్యాలయంలో బిల్లులను సమర్పించాలని అధికారులకు సూచించారు. అప్పుడే రైతులకు పేమెంట్‌ పూర్తవుతుందన్నారు. ఏఈవోలు ప్రతి రోజూ కేంద్రాలను సందర్శించాలని సూచించారు. ప్రతి సొసైటీకీ అదనంగా ఇద్దరిని నియమించుకోవాలన్నారు. సమావేశంలో డీఈవో రవీందర్‌, పౌరసరఫరాల అధికారి స్వామి, డీఎం హరికృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.