శనివారం 23 జనవరి 2021
Komarambheem - Nov 26, 2020 , 00:56:13

గ్రేటర్‌ పీఠం టీఆర్‌ఎస్‌దే

గ్రేటర్‌ పీఠం టీఆర్‌ఎస్‌దే

  • ఎమ్మెల్సీ పురాణం  సతీశ్‌, ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ఆసిఫాబాద్‌ :  గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌ పార్టే కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌, ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సనత్‌నగర్‌ డివిజన్‌ అభ్యర్థి కోలను లక్ష్మికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆసిఫాబాద్‌, తిర్యాణి, రెబ్బెన, వాంకిడి, జైనూర్‌ మండలాల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు, ఆసిఫాబాద్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గాదవేణి మల్లేశ్‌, కేసీఆర్‌ సేవా దళం జిల్లా అధ్యక్షుడు తారిక్‌, మండల ప్రధాన కార్యదర్శి సాలం, గోపాల్‌, కుమార్‌, రాజన్న, చంద్రయ్య, వేణు, జగదీశ్‌ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. 

లింగాపూర్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి లింగాపూర్‌ మండల నాయకులు మండల అధ్యక్షుడు ఆత్రం అనీల్‌, వైస్‌ ఎంపీపీ ఆత్మరాం, కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ సలీం తదితరులు పాల్గొన్నారు. logo