శనివారం 23 జనవరి 2021
Komarambheem - Nov 26, 2020 , 00:56:13

కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి

కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి

  • టీబీజీకేఎస్‌ ఏరియాపాధ్యక్షుడు శ్రీనివాస్‌రావు

రెబ్బెన : కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని టీజీబీకేఎస్‌ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు పిలుపునిచ్చారు. గోలేటి సీహెచ్‌పీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధ్ది చెప్పాలన్నారు. అబూ శ్రీనివాస్‌రెడ్డి, అసిస్టెంట్‌ కార్యదర్శి సదానం దం, సభ్యులు సమి, రవికుమార్‌, అజ్మీరా కిషన్‌, కోల నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

సమ్మె విజయవంతం చేయాలి

మందమర్రి రూరల్‌ : 26వ తేదీ గురువారం నిర్వహించ తలపెట్టిన సమ్మెను విజయవం తం చేయాలని టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఏరియాలోని అన్ని గనులు, డిపార్టుమెంట్లలో వేర్వే రుగా ద్వారా సమావేశాలు నిర్వహించారు. ఈ సం దర్భంగా కేకే 1 గనిపై ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, బొగ్గు బావులను ప్రైవేట్‌ పరం చేసి కార్మికుల నోళ్లు కొడుతుందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలని కోరారు. పిట్‌ కార్యదర్శి బిల్లా మాధవరెడ్డి, బడికెల సంపత్‌, కొండాల్‌రావు, జనగామ మల్లేశ్‌, పెండి రాజిరెడ్డి, వెంకటేశ్‌ ముదిరాజ్‌, తోట రాజిరెడ్డి, గోనే మధుసూదన్‌రావు పాల్గొన్నారు. 

రామకృష్ణాపూర్‌ : సమ్మెను కార్మిక లోకం విజయవంతం చేయాలని జాతీయ సంఘాల జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. సీహెచ్‌పీలో నిర్వహించిన ద్వారా సమావేశంలో నాయకులు మాట్లాడా రు. సమ్మెను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సూచించారు. కార్యక్రమంలో సీఐటీయూసీ ఏరియా అధ్యక్షుడు ఎస్‌ వెంకటస్వామి, ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘం నాయకులు తేజావత్‌ రాంబాబు, కాంపెల్లి సమ్మయ్య, ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి ఎండీ అక్బర్‌ అలీ, ఉపాధ్యక్షుడు ఇప్పకాయల లింగయ్య, గంగిరెడ్డి పాల్గొన్నారు. 

హాజీపూర్‌ : దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చెయ్యాలని ఐఆర్‌టీయూ అనుబంధ కార్మిక సం ఘాలు తమ పూర్తి మద్దతును ఇస్తున్నాయని నయనాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సమ్మెలో అన్ని రం గాల కార్మికులు విజయవంతం చేయాలన్నారు. ఐఆర్టీయూ నాయకులు జయరావు, రాంచందర్‌, రాజమల్లు, తిరుపతి, రమేశ్‌, సంపత్‌రెడ్డి, శంకరయ్య, భూమన్న, రమేశ్‌ పాల్గొన్నారు.

లక్షెట్టిపేట : సమ్మెను విజయ వంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కనిగరపు అశోక్‌ కోరారు. పట్టణంలోని విశ్రాంతి భవనంలో సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ప్రజా సంఘాల నాయకులతో కలిసి విడుదల చేశా రు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు దుంపల రంజిత్‌ కుమార్‌, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు బైరం లింగన్న, కండ్లే శ్రావణ్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

మంచిర్యాల అగ్రికల్చర్‌ : సమ్మెకు అంబేద్కర్‌ ఫూలే యువజన సంఘం(ఏపీవైఎస్‌) సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ కుంటాల శంకర్‌ తెలిపారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌ స్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీవైఎస్‌ జిల్లా కన్వీనర్‌ ఎడ్ల కిష్టయ్య, కో కన్వీనర్‌ రాసపెల్లి రాజు, హాజీపూర్‌ మండల కన్వీనర్‌ సురమల్ల రాంచందర్‌, పట్టణ కన్వీనర్‌ కొప్పర్తి భాస్కర్‌, కోకన్వీనర్‌ సగ్గుర్తి ఆనంద రావు పాల్గొన్నారు.logo