సోమవారం 18 జనవరి 2021
Komarambheem - Nov 24, 2020 , 04:08:35

మహారాష్ట్రకు కొత్తగా రెండు బస్సులు

మహారాష్ట్రకు కొత్తగా రెండు బస్సులు

ఆసిఫాబాద్‌ టౌన్‌ : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రలోని అహేరి, ఆళ్లపల్లికి రెండు  ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ కృష్ణమూర్తి సోమవారం ప్రకటనలో తెలిపారు. రోజూ మధ్యాహ్నం ఒంటి గంటకు ఒకటి, సాయంత్రం 4గంటలకు మరో బస్సు నడుపుతున్నట్లు వివరించారు. ఈ బస్సులు కాగజ్‌నగర్‌,సిర్పూర్‌(టీ) మీదుగా మహారాష్ట్రలోని అహేరి, ఆళ్లపల్లికి  రాకపోకలు సాగించనున్నట్లు  వెల్లడించారు. ప్రస్తుతానికి తాత్కాలిక పర్మిట్‌తో బస్సులు నడుపుతున్నామని, ప్రయాణికుల అవసరాలు,రద్దీ గమనించిన తర్వాత పూర్తి స్థాయిలో నడుపుతామని పేర్కొన్నారు.