ఆదివారం 17 జనవరి 2021
Komarambheem - Nov 24, 2020 , 04:08:35

జోడెఘాట్‌ అభివృద్ధిపై డీఎఫ్‌వో ప్రశంస

జోడెఘాట్‌ అభివృద్ధిపై డీఎఫ్‌వో ప్రశంస

కెరమెరి : ఆదివాసీ వీరుడు కుమ్రం భీం పోరాడిన జోడెఘాట్‌ అభివృద్ధి ప్రశంసనీయమని, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా అటవీ అధికారి శాంతారాం అన్నారు. భీం స్మృతి చిహ్నం, ఆదివాసీ స్మారక మ్యూజియాన్ని డీఎఫ్‌వో తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సందర్శించారు. భీం విగ్రహం, సమాధి వద్ద నివాళులర్పించారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ సలహాదారుడు మోహన్‌ గురుస్వామి, సుప్రీం కోర్టు న్యాయవాది మేనక గురుస్వామి జోడెఘాట్‌, బాబేఝరి ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు వితరణ చేసిన ప్లేట్లు, గ్లాసులను డీఎఫ్‌వో సిబ్బందికి అందించారు.

అటవీ ప్రాంతంలోనూ పోరాట వీరుడికి ఘనకీర్తి లభించేలా ప్రభుత్వం ఆకర్షణీయంగా నిర్మించిందన్నారు. ఆదివాసుల సంస్కృతీ సంప్ర దాయాలు వారు వినియోగించే పరికరాలు, దేవతామూర్తులు ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ జర్నలిస్ట్‌ హర్‌పాల్‌సింగ్‌, జోడేఘాట్‌, చాల్‌బాడీ ఎఫ్‌బీవోలు వెంకటేశ్వర్‌, వసంతలక్ష్మి, హెచ్‌ఎం ధర్మారావ్‌, ఉపాధ్యాయులు మోతీరాం, ఆత్రం రాజు తదితరులు పాల్గొన్నారు.