అల్తాఫ్ హాసన్, శాంతిరావు, సాత్విక్జైన్, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్ని పోషించిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. రామ్‌నారాయణ్ దర్శకుడు. రామ్ వీరపనేనితో కలిసి సతీష్‌కుమార్ నిర్మించారు. శుక్రవారం ‘జీ5’ఓటీటీలో విడుదలైంది. నిర్మాత సతీష్‌కుమార్ మాట్లాడుతూ ‘పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో వినోదాత్మక కథాంశమిది. హిట్ టాక్ వస్తోంది. పాత్రలన్నీ రియలిస్టిక్‌గా న్నాయంటున్నారు. ప్రస్తుతం మా సంస్థపై ‘బ్యాక్‌డోర్’తో పాటు పాయల్‌రాజ్‌పుత్ కథానాయికగా మరో సినిమా చేస్తున్నాం’ అని తెలిపారు.