చకచకా రిజిస్ట్రేషన్లు

- తహసీల్ కార్యాలయాల్లో సందడి
- వెంటనే ధ్రువపత్రాల అందజేత
- ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
చెన్నూర్ : తహసీల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. చెన్నూర్ తహసీల్ కార్యాలయం లో సోమవారం రెండు రిజిస్ట్రేషన్లు జరిగాయి. మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన ఎలకుచ్చి భక్తయ్య సర్వే నంబర్ 80/ఆ/1లోని 8 గుంటలు, సర్వే నంబర్ 24లోని 31గుంటల భూమిని తన కుమారుడు ఎలకుచ్చి గట్టయ్యకు గిఫ్ట్‌గా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేశారు. పానెం లక్ష్మికి బీరెల్లి శివారులోని సర్వే నం బర్ 296 /1లో 0.21గుం టలు, సర్వే నంబర్ 306/2లో 39 గుంటల భూమి ఉంది. ఇటీవల లక్ష్మి మృతి చెందింది. ఈ భూమిని విరాసత్ ద్వారా అన్నదమ్ములు పానెం రాజయ్య సర్వే నంబర్ 296/1లో 11 గుంటలు, 306/2లో 19 గుంటలు, పానెం సమ్మయ్య సర్వే నంబర్ 296/1లో 10 గుంటలు, 306/2లో 20 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ ప్రక్రియంతా అరగంటలో పూర్తి అయింది. పట్టాదారులు ఆనందం వ్యక్తం చేశారు. వారికి తహసీల్దార్ జ్యోతి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
నెన్నెల : సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు శరవేగంగా పని చే స్తున్నాయి. ఈ నెల 2న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నది. గిఫ్డ్‌డీడ్, మ్యుటేషన్, అమ్మకాల రిజి స్ట్రేషన్లు క్షణాల్లో పూర్తి కావడం.. చేతికి కాగితాలు అంద డంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెన్నెల కార్యాలయంలో నవంబర్ 2 నుంచి 9 వరకు 24 రిజిస్ట్రేషన్లు చేశారు. ఆటంకం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నట్లు తహసీల్దార్ సంప తి శ్రీనివాస్ తెలిపారు.
మందమర్రి రూరల్ : అందుగలపేటకు చెందిన రైతు నిండు గూరి రాజయ్యకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందించామని తహసీ ల్దార్ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తండ్రి భూమయ్య మరణించ డంతో ఆయన పేరిట ఉన్న భూమిని రాజయ్య పేరిట రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. 15 నిమిషాల్లో పూర్తి చేసి రైతుకు రిజిస్ట్రేష న్ పత్రాలను అందించామని చెప్పారు. జడ్పీటీసీ ఎల్పుల రవి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ పాండే పాల్గొన్నారు.
20 నిమిషాల్లోనే పట్టా చేశారు..
సీసీసీ నస్పూర్ : మాది విలేజ్ నస్పూర్ గ్రామం. 10 ఎకరాల భూమి ఉంది. నేను 30 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న. దీంతోపాటు సింగరేణిలో పని చేస్తున్న. మా పెళ్లిరోజు సందర్భం గా నా భార్యకు కానుకగా కొంత భూమి గిఫ్ట్ ఇయ్యాలనుకున్న. ఈ లో గా సీఎం కేసీఆర్ సార్ కొత్తగా రెవెన్యూ చట్టం తీసుకొచ్చిండు. ధరణి పోర్టల్ మొదలైనంక ఈ నెల 2న ఎకరం 20గుంటల భూమిని నా భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు మీసేవకు వెళ్లి ధరణిలో స్లాట్ బుక్ చేసిన. సోమవారం సమయం ఇచ్చారు. ఉద యం నా భార్య, నేను తహసీల్దార్ ఆఫీస్‌కు వచ్చినం. 20 నిమిషాల్లో మా పని అయిపోయింది. నేను గిఫ్ట్ కింద ఇచ్చిన భూమి 20 నిమిషాల్లో నా భార్య పేరు మీదికి మారింది. ఇందుకు సంబంధించిన పత్రాలు, పట్టాపాస్ బుక్కు అధికారులు మాకు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. ధరణి పోర్టల్ వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
- ముస్త్యాల శ్రీదేవి-రమేశ్ దంపతులు
తాజావార్తలు
- పద్య ప్రక్రియను ఇష్టపడే నాయకుడు సీఎం కేసీఆర్
- మార్బుల్ బండ మీదపడి బాలుడు మృతి
- చెత్త తీసుకురండి.. కడుపు నిండా భోజనం చేయండి..
- ఒకేసారి రెండు వైపులా రనౌటైన బ్యాట్స్‌మన్.. వీడియో
- హాట్ లుక్ లో సారా హొయలు..ట్రెండింగ్‌లో స్టిల్స్
- కరోనా దెబ్బ.. మరో 12 కోట్ల మంది పేదరికంలోకి..
- కిసాన్ ర్యాలీ : ముంబైకి బారులుతీరిన రైతులు
- బైడెన్ వలస విధానానికి గూగుల్, ఆపిల్ సీఈఓల ప్రశంసలు
- రాష్ట్రానికి ఎస్టీ రెసిడెన్షియల్ లా కాలేజీ
- నేతాజీ కార్యక్రమం : దీదీకి తృణమూల్ ఎంపీ మద్దతు