శుక్రవారం 04 డిసెంబర్ 2020
Komarambheem - Nov 01, 2020 , 00:33:16

ఈ నెల 6 నుంచి పత్తి కొనుగోళ్లు

ఈ నెల 6 నుంచి పత్తి కొనుగోళ్లు

ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ : ఈ నెల 6 నుంచి సీసీఐ ద్వారా ప్రభుత్వం ప్రకటించిన ధరకు పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని అదనపు కలెక్టర్‌ రాంబాబు తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసిఫాబాద్‌లోని హీనా ఇండస్ట్రీస్‌, వాంకిడిలోని ఆర్‌బీ ఇండస్ట్రీస్‌, కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్డులోని శ్రీనిధి కాటన్‌ మిల్‌లో సీసీఐ ద్వారా ప్రభుత్వం ప్రకటించిన ధరకు పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రైతులు పత్తి అమ్ముకొనే ముందు సరైన జిరాక్స్‌లతో వెళ్లాలన్నారు. 

పత్తిని బాగా ఆరబెట్టి 8 శాతం తేమ ఉండేలా చూడాలన్నారు. వ్యవసాయశాఖ వారి సూచనలు పాటిస్తూ కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం పత్తి అమ్మకాలు చేపట్టాలని సూచించారు.  సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.