బుధవారం 25 నవంబర్ 2020
Komarambheem - Oct 31, 2020 , 00:55:02

సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధికి కృషి

సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధికి కృషి

  • మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్‌

కాసిపేట : సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని సింగరేణి మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మండలంలోని ముత్యంపల్లి పంచాయతీలోని క్రీడా మైదానంలో సింగరేణి ఆధ్వర్యంలో స్వచ్ఛతా మహా, స్వచ్ఛతా  హీ సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవా రం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి జీఎం శ్రీనివాస్‌ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

డీఎంఎఫ్‌టీ ద్వారా పలు అభివృద్ధి  పనులు చేపట్టామని తెలిపారు. పంచాయతీల్లో సమస్యలు ఉంటే గ్రామ సభల ద్వారా తీర్మానం చేసి అందిస్తే పరిష్కరిస్తామని చెప్పారు. ఓపెన్‌ కాస్ట్‌ లో పార దర్శకంగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆర్‌వీఆర్‌ కాంట్రాక్ట్‌ ద్వారా 50 శాతం ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. మిగతావి సింగరేణి పరిసర గ్రామాల్లో సొసైటీ, గ్రామ కమిటీల ద్వారా ఓపెన్‌ కాస్ట్‌లో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. మందమర్రి ఏరియా వ్యాప్తంగా 3.40 లక్షల మొక్కలు నాటినట్లు వివరించారు. ముత్యంపల్లిలో క్రీడా మైదానం చుట్టూ మొక్కలు పెడితే చాలా అందంగా ఉంటుందన్నారు. మైదానం చుట్టూ ఫెన్సింగ్‌ వేయించాలని, వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌, పార్క్‌లో పిల్లల కోసం ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానిక ప్రజాప్రతినిధులు జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామ సభ తీర్మానం చేసి పంపిస్తే సమస్యలు పరిష్కరిస్తామని జీఎం హామీ ఇచ్చారు.

అనంతరం జీఎంను ప్రజాప్రతినిధులు సన్మానించారు. ముత్యంపల్లిలో ఎక్కడా చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉండడంపై పంచాయతీ పాలక వర్గం, సిబ్బంది, ప్రజలను జీఎం అభినందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్‌ ఎంపీపీ పూస్కూరి విక్రంరావు, సర్పంచ్‌ ఆడె బాదు, ఉప సర్పంచ్‌ బోయిని తిరుపతి, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్‌, కోఆప్షన్‌ సిరాజ్‌ఖాన్‌, టీఆర్‌ఎస్‌ కార్యదర్శి మోటూరి వేణు, సురేందర్‌, సందీప్‌, గంగా, విజయ, కాసిపేట గ్రూప్స్‌ ఏజెంట్‌ రాజేందర్‌, ఎస్టేట్‌ ఆఫీసర్‌ నవనీత, రమణారెడ్డి, పర్యావరణాధికారి ప్రభాకర్‌, డీవైపీఎం శ్యాంసుందర్‌ పాల్గొన్నారు.