బుధవారం 25 నవంబర్ 2020
Komarambheem - Oct 31, 2020 , 00:55:02

భీం వర్ధంతిని విజయవంతం చేయండి

భీం వర్ధంతిని విజయవంతం చేయండి

  • ఎమ్మెల్యే ఆత్రం సక్కు
  •  పోస్టర్‌ విడుదల

ఆసిఫాబాద్‌: జోడెఘాట్‌లో శనివారం నిర్వహించనున్న కుమ్రం భీం వర్ధంతిని విజయవంతం చేయాలని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పిలుపునిచ్చారు. క్యాంపు కార్యాలయంలో ఉత్స వ కమిటీ సభ్యులతో కలిసి వ ర్ధంతి పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీం స్ఫూ ర్తితో ఆదివాసులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్ర భుత్వం జోడెఘాట్‌ను అన్ని వి ధాలా అభివృద్ధి చేసిందన్నారు. కార్యక్రమంలో కమిటీ స భ్యులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ..

ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ : జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు శుక్రవారం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెరమెరికి చెందిన నరేందర్‌కు రూ.22 వేలు, ఆసిఫాబాద్‌ మండలం జెండాగూడకు చెందిన విమలాబాయికి రూ.26 వేలు ధనోరకు చెందిన షేక్‌ ఇసాక్‌కు రూ.18 వేలు, గుండి గ్రామానికి చెందిన సుందరయ్యకు రూ. 16 వేలు మంజూరయ్యాయని చెప్పారు.