శనివారం 28 నవంబర్ 2020
Komarambheem - Oct 30, 2020 , 01:00:43

ఇందారం ఓసీ సందర్శన

ఇందారం ఓసీ సందర్శన

జైపూర్‌ : ఇందారంఖని 1ఏ గనిని గురువారం సింగరేణి డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ అండ్‌ ప్లానింగ్‌ చంద్రశేఖర్‌ సందర్శించారు. ఉత్పత్తి వివరాలను అధికారులను అడి గి తెలుసుకున్నారు. గని గోదావరికి అతి సమీపంలో ఉన్నందున నాణ్యతతో కూడిన కట్ట నిర్మాణపనులు చేపట్టాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. బొగ్గును శ్రీరాంపూర్‌ సీహెచ్‌పీకి తరలించే విషయంపై అధికారులతో చర్చిం చారు. అనంతరం జైపూర్‌ సింగరేణి విద్యుత్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ఇందారం ఓసీ ప్రాజెక్ట్‌ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, మేనేజర్‌ ఉమాకాంత్‌, రక్షణ అధికారి పేరా రెడ్డి, జీఎం శాస్త్రి, సీటీసీ సంజయ్‌ కుమార్‌ ష్యూర్‌ పాల్గొన్నారు.