శనివారం 28 నవంబర్ 2020
Komarambheem - Oct 30, 2020 , 01:00:40

బుద్ధుడి బోధనలు అనుసరణీయం

బుద్ధుడి బోధనలు అనుసరణీయం

  • ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ఆసిఫాబాద్‌ : బుద్ధుడి బోధనలు ఎల్లప్పుడు అనుసరణీయమని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షభూమి అంబేద్కర్‌ సెంట్రల్‌ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 64వ దమ్మచక్ర పరివర్తన దినోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. బుద్ధ విగ్ర హం వద్ద నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే సక్కు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ లక్షలా ది మంది అనుయాయులతో కలిసి 1956 లో బౌద్ధ్ద ధర్మాన్ని స్వీకరించిన రోజును దమ్మ చక్ర పరివర్తన దినంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. బౌద్ధం సకల మానవాళిని సమానంగా చూ స్తుందన్నారు. బుద్ధుడి కాలంలో కులాలు, మతాలు లేవని తెలిపారు. కార్యక్రమంలో అంబేద్కర్‌ సెంట్రల్‌ కమిటీ అధ్యక్షుడు అశోక్‌, లుంబిని దీక్ష భూమి కమిటీ అధ్యక్షుడు తిరుపతి, స్వేరోస్‌ నార్త్‌ జోన్‌ అధ్యక్షుడు హేమంత్‌ తదితదిరులున్నారు.