మంగళవారం 24 నవంబర్ 2020
Komarambheem - Oct 30, 2020 , 01:00:37

భీం వర్ధంతికి ఏర్పాట్లు చేయండి

భీం వర్ధంతికి ఏర్పాట్లు చేయండి

  • అధికారులు సమన్వయంతో పనిచేయాలి
  • తాగునీరు, భోజన వసతి కల్పించాలి
  • విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉండవద్దు
  • ఐటీడీఏ పీవో భవేశ్‌ మిశ్రా
  • హట్టి బేస్‌ క్యాంప్‌లో అధికారులతో సమీక్ష
  • నేటి రాత్రి అవ్వల్‌ పేన్‌ పూజ

కెరమెరి : కుమ్రం భీం వర్ధంతికి ఎ లాంటి లోటు రానివ్వకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేశ్‌ మిశ్రా అన్నారు. మండలంలోని హట్టి బేస్‌ క్యాంప్‌ను గురువారం సందర్శించారు. కుమ్రం భీం విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆశ్రమ పాఠశాలలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. భీం 80వ వర్ధంతిని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. ముఖ్యంగా తాగునీరు, భోజన సౌకర్యంతో పాటు వాహనాల పార్కింగ్‌ వద్ద ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. వేడుకలు పూర్తయ్యేవరకు విద్యుత్‌ సరఫరా లో అంతరాయం లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. సీసీడీపీ నిధులతో ఆదివాసులకు 24 ఎడ్లబండ్లు, 12 ఎడ్ల జతలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచాలన్నారు. అదే రోజు జోడెఘాట్‌కు మంజూరైన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు భూమిపూజ చేస్తారని పీవో స్పష్టం చేశారు. బేబీ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీడీపీవో రెబ్బెకకు సూచించారు. కార్యక్రమంలో డీటీడీవో దిలీప్‌ కుమార్‌, డీఎస్పీ అచ్చేశ్వర్‌రావ్‌, సీఐ సుధాకర్‌, ఏటీడీవో ఆత్రం భాస్కర్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

నేడు అవ్వల్‌ పేన్‌ పూజ..

కుమ్రం భీం వర్ధంతికి ఒకరోజు ముం దు నిర్వహించే అవ్వల్‌ పేన్‌ పూజను భీం వారసులు శుక్రవారం రాత్రి నిర్వహించనున్నారు. అందుకు కావాల్సిన ఏ ర్పాట్లను కుమ్రం భీం వంశీయులు సిద్ధం చేస్తున్నారు. యేటా ఆదివాసుల సం స్కృతి, సంప్రదాయాలతో రాత్రి డప్పు వాయిద్యాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సందర్భంగా కుమ్రం భీం మనువడు సోనేరావ్‌ బంధువులతో కలిసి జోడెఘాట్‌ గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.