సోమవారం 25 జనవరి 2021
Komarambheem - Oct 29, 2020 , 02:16:46

అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ

అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ

చెన్నూర్‌ టౌన్‌ : మండలంలోని 108, 102, 19 62 అంబులెన్స్‌లను ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా, పెద్దపల్లి జిల్లాల ప్రోగ్రామ్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి సలహాలు, సూచనలు అందజేశారు. ఆయనతో పాటు 108 జిల్లా కార్య నిర్వహణాధికారి వసంత్‌ ఉన్నారు. ఈ సందర్భంగా  విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ 3 నుంచి 7 నెలల గర్భిణులను ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి, తిరిగి వారి ఇంటికి తీసుకురావాలని సూచించారు. సర్కారు దవాఖానలో ప్రసవమైన తర్వాత బాలింతను 102 అంబులెన్స్‌లో తీసుకెళ్లి క్షేమంగా ఇంటి వద్ద దించిరావాలని పేర్కొన్నారు. రికార్డులను, మందులను తనిఖీచేశారు. ఇటీవలే చెన్నూర్‌లో ప్రారంభమైన 108 వాహనం గురించి సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు. చెన్నూర్‌, కోటపల్లి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. logo