శనివారం 05 డిసెంబర్ 2020
Komarambheem - Oct 28, 2020 , 02:11:41

ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష

కోటపల్లి : కోటపల్లి మోడల్‌ స్కూల్‌లో ఆరో తరగతి ప్రవే శం కోసం మంగళవారం నిర్వహించిన పరీక్షకు 53 మంది విద్యార్థులు హాజరయ్యారు. 86 మంది గైర్హాజరయ్యారు. 139 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చీఫ్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మణ్‌ రెడ్డి, డిపార్ట్‌మెంట్‌ అధికారి చౌదరి తెలిపారు.

దండేపల్లి : మండలంలోని లింగాపూర్‌ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు సూపరింటెండెంట్‌ అనీలా, డిపార్ట్‌మెంట్‌ అధికారి అప్పాల మనోహర్‌ తెలిపారు. 182 మందికి 80 మంది విద్యార్థులు హాజర య్యారు. 102 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాన్ని ఎంఈవో రవీందర్‌ సందర్శించారు.

కాసిపేట : మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో ఆరో తరగతి ప్రవేశానికి నిర్వహించిన అర్హత పరీక్షకు 59 మంది హాజరయ్యారు. 53 మంది గైర్హాజరైనట్లు పరీక్షా కేంద్రం సీఎస్‌ అందె నాగ మల్లయ్య, డీవో రాథోడ్‌ రమేశ్‌ పేర్కొన్నారు. బుధవారం 7, 8వ తరగతుల విద్యార్థులకు ఉద యం 10 నుంచి 12 గంటల వరకు, గురువారం 9, 10 తరగతుల విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు అర్హత పరీక్ష ఉంటుందని వారు తెలిపారు.