ఆదివారం 29 నవంబర్ 2020
Komarambheem - Oct 28, 2020 , 02:13:15

అవినీతి నిర్మూలనకు కృషి చేయాలి

అవినీతి నిర్మూలనకు కృషి చేయాలి

మందమర్రి రూరల్‌ : అవినీతిని నిర్మూలించేందుకు అందరూ కృషి చేయాలని జీఎం చిం తల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మందమర్రిలోని           తన కార్యాలయంలో విజిలెన్స్‌ వారోత్సవాల ను ఆయన మంగళవారం ప్రారంభించారు         ఈ సందర్భంగా జీఎం మాట్లాడారు. సింగరేణి లో అవినితి నిర్మూలన చట్టాన్ని 1987లో ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతి సంవత్సరం విజిలెన్స్‌ వారోత్సవాలు నిర్వహి స్తున్నామని చెప్పారు. సంస్థలో ఎలాం టి అవినీతి జరుగకుండా ప్రతి విషయంపై కార్మికులకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నా రు. ఏరియాలో ఎలాంటి అవినీతి జరిగినా వెంటనే సంబంధిత శాఖకు సమాచారం ఇవ్వా లని సూచించారు. సంస్థ రక్షణకు ఇది ఎంతో అవసరమని పేర్కొన్నారు. విధులను దైవంతో భావించి, నిజాయితీగా పని చేస్తే ఎలాంటి అసమానతలు తలెత్తే అవకాశం ఉండదని పేర్కొ న్నారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు వారోత్సవాలు జరుగుతాయని పేర్కొ న్నారు. వీటిని కార్మికులు విజయవంతం చే యాలని సూచించారు. ఈ సందర్భంగా అధి కారులు, కార్మికులు ప్రతిజ్ఞ చేశారు.  ఇందులో ఇన్‌చార్జి ఎస్వోటూ జీఎం రామ్మోహన్‌రావు, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు ఎం సంప త్‌, పీఎం రవి ప్రసాద్‌, డీవైపీఎం రెడ్డిమల్ల తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు. 

రామకృష్ణాపూర్‌ : రామకృష్ణాపూర్‌లోని ఉపరితల గనిలో విజిలెన్స్‌ వారోత్సవాలను మేనేజర్‌ సీహెచ్‌ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రాముఖ్యతను వివరించారు. డీవైఎస్‌ఈ దిలీప్‌కుమార్‌, డీవై మేనేజర్‌ సంపత్‌, ప్రశాంత్‌ జీవన్‌, ఈఈ శంకర్‌మూర్తి, పిట్‌ కార్యదర్శు లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే ఆర్కేపీ సీహెచ్‌పీలో విజిలెన్స్‌ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. అధికారులు, కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. ఉద్యోగులు చట్టబద్ధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని అధికారులు సూచించారు. పిట్‌ కార్యదర్శి జే శ్రీనివాస్‌, సూపర్‌వైజర్లు రమణారావు, జే వేణు, బీ రామకృష్ణమూర్తి, కోల మోహన్‌, రాజశేఖర్‌, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.