బుధవారం 27 జనవరి 2021
Komarambheem - Oct 28, 2020 , 02:13:11

సర్కారు దవాఖానలో సదరమ్‌ క్యాంపు ప్రారంభం

సర్కారు దవాఖానలో సదరమ్‌ క్యాంపు ప్రారంభం

ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ : జిల్లాకేంద్రంలోని సర్కారు దవాఖానలో సదరమ్‌ క్యాంపును మంగళవారం డీఎంహెచ్‌వో కుమ్రం బాలు ప్రారంభించారు. మొత్తం 13 మంది పేర్లు నమోదు చేసుకోగా 10 మంది హాజరయ్యారు. 9 మంది రెన్యూవల్‌ చేసుకోగా మరొకరు కొత్తగా నమోదు చేసుకున్నారు. డీఎంహెచ్‌వో  కుమ్రం బాలు సదరమ్‌ సర్టిఫికెట్లు అందజేశారు. రేపు ఎముకలకు సంబంధించిన క్యాంపు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఈఎన్‌టీ స్వామి, ఆడియాలజిస్ట్‌ రాఘవేంద్ర, ఐకేపీ డీపీఎం యశోద, ఏపీఎం కోనయ్య, సీసీ రమేశ్‌ పాల్గొన్నారు.


logo