శుక్రవారం 04 డిసెంబర్ 2020
Komarambheem - Oct 27, 2020 , 02:54:02

నలుగురు బలవన్మరణం

  నలుగురు బలవన్మరణం

జిల్లాలో వేర్వేరు చోట్ల నలుగురు ఆత్మహ త్య చేసుకున్నారు.  పెళ్లి చేసుకోవాలని వేధి స్తుండడంతో ఓ మహిళ.. భర్త వేధింపులు భరించలేక భార్య.. ముగ్గురు పిల్లల పోషణ భారమై తండ్రి.. చిన్న గొడవతో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. 

సిర్పూర్‌(టి) : పెళ్లి చేసుకోవాలని ఓ వ్యక్తి వేధిస్తుండడంతో మండల కేంద్రంలోని పాత ట్లగూడకు చెందిన పర్శ స్వాతి (26) పురుగు ల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. ఎస్‌ ఐ ఎం రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకా రం.. మండల కేంద్రానికి చెందిన స్వాతి (26)కి ఇట్యాల గ్రామానికి చెందిన వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆనంతరం రెండేళ్ల క్రితం ఆయనతో విడాకులు తీసుకు న్నది. అప్పటి నుంచి స్వాతి తన తల్లిగారిం ట్లో ఉంటున్నది. కొద్ది రోజుల నుంచి దూరపు బంధువు తనను పెళ్లి చేసుకోవాలని స్వాతిని వేధిస్తున్నాడు. దీంతో పురుగుల మందు తా గింది. గమనించిన కుటుంబసభ్యులు స్వాతి ని దవాఖానకు తరలిస్తుండగా మార్గమ ధ్యం లో మృతి చెందింది. ఈ మేరకు తండ్రి పర్శ రమేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

భర్త వేధింపులు భరించలేక.. 

బెజ్జూర్‌ : భర్త వేధింపులు భరించలేక మం డలంలోని కొత్తగూడ గ్రామానికి చెందిన లెం డుగురి విమల (38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ సాగర్‌ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. విమల భర్త భీంరావు తరుచూ ఇంట్ల్లో గొడవ చేస్తూ విమలను వేధిస్తున్నారు. దీంతో విమ ల తల్లిదండ్రులు పలు మార్లు కుల పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టినా భీంరా వు లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో విమల వేధింపులు భరించలేక ఆదివారం రాత్రి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యు లు ఆమెను కాగజ్‌నగర్‌ దవాఖానకు తరలిం చారు. చికిత్స పొందుతూ విమల సోమవా రం తెల్లవారుజామున మృతి చెందింది. భర్త వేధింపులే తన కూతురు ఆత్మహత్యకు కారణ మని మృతురాలి తల్లి గౌత్రె తార పోలీసుల కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొ న్నారు. కాగా మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. 

చిన్న గొడవతో..

చింతలమానేపల్లి : మండలంలోని రవీంద్రనగర్‌ గ్రామానికి చెందిన గౌతమ్‌ గైన్‌ (45) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రవీంద్రనగర్‌కు చెందిన గౌతమ్‌ ఇంట్లో చిన్న గొడవ జరగడంతో మనస్తాపానికి గురయ్యాడు.  పత్తిచేను వద్దకు వెళ్లి తుమ్మ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విమల్‌ గైన్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న ట్లు ఆయన తెలిపారు. 

పిల్లల పోషణ 

చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామానికి చెందిన ఆలం శంకర్‌ (45) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌ భార్య నాలుగేళ్ల క్రితం మృతి చెందింది. ముగ్గురు పిల్లల పోష ణ భారంగా భావించి తాగుడుకు బానిసై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకు న్నాడు. శంకర్‌ అక్క ఆత్రం సుగుణ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.