శుక్రవారం 04 డిసెంబర్ 2020
Komarambheem - Oct 27, 2020 , 02:54:06

ఊరూరా దసరా

ఊరూరా దసరా

  • భక్తి శ్రద్ధలతో శమీ పూజలు 
  •  పాల్గొన్న జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి,ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప
  • పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో వాహన,ఆయుధ పూజలు
  • కాగజ్‌నగర్‌లో రామ్‌లీలా వేడుక
  • భక్తులతో పోటెత్తిన ఆలయాలు

జిల్లా వ్యాప్తంగా ఆదివారం దసరా వేడుకలు అంబరాన్నంట జిల్లా కేంద్రంలో  జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మె ల్యే ఆత్రం సక్కు, కాగజ్‌నగర్‌లో కోనేరు కోనప్ప, ఆయన సతీమణి రమాదేవి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఏఎస్పీ సుధీంద్ర ఆ యుధ, వాహన పూజ చేశారు. ఉదయం నుంచే ఆలయా ల్లో భక్తుల సందడి నెలకొంది. కాగజ్‌నగర్‌లో త్రిశూల్‌ ప హాడ్‌పై  నిర్వహించిన రామ్‌లీలా కార్యక్రమం ఆకట్టుకున్న ది. రావణుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. భక్తులు కొ విడ్‌ -19 నిబంధనలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే రెబ్బెన మండలం గోలేటిలోని శ్రీ భీమన్న క్రీడామైదానం, కేకే గార్డెన్‌ వద్ద రావణాసూరుడి దిష్టిబొమ్మను ద హనం చేశారు. సిర్పూర్‌(టి) మండలకేంద్రంలో వేంకటేశ్వర ఆలయ, హిందూ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో స్వా మివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంత రం రథోత్సవం చేపట్టారు. చుట్టపక్కలా గ్రామాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  డీఎస్పీ బీఎల్‌ఎన్‌ స్వామి, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు మహవీర్‌ ప్రసాద్‌లోయా, మురళి, శ్రీనివాస్‌, తహసీల్దార్‌ ప్రమోద్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ బీఎల్‌ఎన్‌ స్వామి ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌వో మోహన్‌ బందోబస్తు చేపట్టారు. 

-ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌ టౌన్‌ / కెరమెరి/ జైనూర్‌/ చింతలమానేపల్లి/ బెజ్జూర్‌/  రెబ్బెన/దహెగాం/సిర్పూర్‌ (టి) /కౌటాల/ కౌటాల రూరల్‌/పెంచికల్‌పేట్‌