బుధవారం 25 నవంబర్ 2020
Komarambheem - Oct 25, 2020 , 04:53:23

జిల్లాలో 70 రైతు వేదిక భవనాల నిర్మాణం

జిల్లాలో 70 రైతు వేదిక భవనాల నిర్మాణం

 • పలుచోట్ల పూర్తి, మిగతా చోట్ల తుదిదశకు ..
 • త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం

మండలాల వారీగా..

 • ఆసిఫాబాద్‌ -06
 • కాగజ్‌నగర్‌ -04
 • రెబ్బెన -04
 • దహెగాం -06
 • పెంచికల్‌ పేట్‌ -03
 • వాంకిడి -07
 • కౌటాల - 07
 • సిర్పూర్‌ (టి) - 04
 • కెరమెరి -05
 • తిర్యాణి - 05
 • బెజ్జూర్‌ -04

 • చింతలమానేపల్లి -06

ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ :  జిల్లాలో రైతు వేదికల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పూర్తికాగా, మిగతా చోట్ల  తుదిదశకు చేరుకున్నాయి. రైతులందరూ ఒకేచోట స మావేశమై చర్చించుకునేందుకు వీలుగా కొన్ని నెలల క్రితం రైతువేదికల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చు ట్టింది. ఇందులో భాగంగా  జిల్లాలో  70 వేదికల పను లు ప్రారంభించింది.  ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నుంచి రూ. 10 లక్షలు, వ్యవసాయశాఖ రూ. 12 లక్షలు మొత్తం కలిపి రూ. 22 ల క్షలతో ఒక్కోదాన్ని నిర్మిస్తున్నారు.  ఇందులో ఒక హాల్‌, వ్య వసాయ విస్తారణ అధికారి, రైతు బంధు కమిటీ సభ్యులకు వేర్వేరు గదులు, మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా మ రుగుదొడ్లు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం తరువాత రైతుల కు తమ సమస్యల పరిష్కారానికి అవసరమైన వనరుల ను సమకూరుస్తామని అధికారులు తెలిపారు. అధికారులు, ప్ర జాప్రతినిధులు నిత్యం పనులు పర్యవేక్షిస్తూ సలహాలు, సూ చనలు చేస్తూ త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ఇక తమకు ఇబ్బంది ఉండడని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.