శుక్రవారం 04 డిసెంబర్ 2020
Komarambheem - Oct 23, 2020 , 00:31:55

జంగుబాయి సన్నిధిలో ముందస్తు దసరా సంబురాలు

జంగుబాయి సన్నిధిలో ముందస్తు దసరా సంబురాలు

  •  సంస్కృతీ సంప్రదాయాలతో ఆదివాసుల పూజలు

మహారాష్ట్ర సరిహద్దులో మహరాజ్‌గూడ అటవీ ప్రాంతంలోని ఆదివాసుల ఆరాధ్య దేవత జంగుబాయి సన్నిధిలో ముందస్తు దసరా వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. 

 -కెరమెరి 

డోలు, సన్నాయి వాయిద్యాలతో వెళ్లి సహ్యాద్రి పర్వతంలోని గుహలో కొలువైన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివాసుల 8 గోత్రాల కటోడాల ఆధ్వర్యంలో సంస్కృతీ సంప్రదాయం ప్రకా రం పూజలు చేశారు. కోనేరు వద్ద పుణ్యస్నానాలు చేసి, నవధాన్యాలతో తయారు చేసిన  నైవేద్యాన్ని సమర్పించారు. మైసమ్మ, రావుడ్క్‌ పేన్‌, పోచమ్మ తల్లి ఆలయాల వద్ద కోళ్లు, మేకలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అక్కడే వంటలు వండి సహపంక్తి భోజనం చేశారు. రాష్ట్రంతో పాటు, మహారాష్ట్ర నుంచి భక్తు లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.