శుక్రవారం 22 జనవరి 2021
Komarambheem - Oct 23, 2020 , 00:31:52

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

 రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

  •  వచ్చే నెలలోనే వివాహం శోకసంద్రంలో  కుటుంబ సభ్యులు

ఆసిఫాబాద్‌ క్రైం/ కౌటాల : ఆసి ఫాబాద్‌ మండలం సాలెగూడ సమీపం లో బొలెరో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో కౌటాలకు చెందిన ముద్రకోల సురేశ్‌(26)  మృతి చెందాడు. ఆసిఫాబాద్‌ ఎస్‌హెచ్‌వో ఆకుల అశోక్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కౌటా లకు చెందిన సురేశ్‌ ఆన్‌లైన్‌ కొరియర్‌ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. సురేశ్‌ గురువారం ఆసిఫాబాద్‌ రోడ్డుపై వెళుతుండగా, అదే సమయంలో అటు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీ కొనడంతో  అక్కడికక్కడే మృతి చెందాడు. 

వచ్చే నెలలో వివాహం

కౌటాలకు చెందిన ముద్రకోల కమల-స్వామి దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు సురేశ్‌. అతని చిన్నతనంలోనే తండ్రి స్వామి అనారోగ్యం తో మృతి చెందాడు. తల్లి కమల కూలీ పనులు చేసి కొడుకును పోషించింది. సురేశ్‌ మూడేళ్లుగా మండల కేంద్రంలో జిరాక్స్‌, ఆన్‌లైన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. రెండేళ్లుగా ఆన్‌లైన్‌ సంస్థలకు కొరియర్‌ ఏజెంట్‌గా పనిచేస్తు న్నాడు. సురేశ్‌కు పెద్ద పల్లి జిల్లా చిన్న కల్వలకు చెందిన యువతితో వివాహం కుదిరింది. గత ఆగస్టులో వీరికి నిశ్చి తార్థం జరిగింది. నవంబర్‌లో వివాహాని కి ఇరు కుటుంబాలు తేదీని నిశ్చయిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత లోనే సురేశ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెంద డంతో రెండు కుటుంబాలు శోక సంద్రంలో మునిగాయి.  

బాధిత కుటుంబానికి పరామర్శ 

ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వెంటనే కోనేరు చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు కోనేరు వంశీకృష్ణను ఘటన స్థలానికి పంపారు. అక్కడ పరిస్థితిని ఆరా తీసి, మృత దేహానికి పోస్ట్‌ మార్టం పూర్తి చేయించారు. ఘటన స్థలానికి ఎంపీపీ విశ్వనాథ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు అజ్మత్‌ అలీ, సర్పంచ్‌ మౌనిశ్‌, ఉపసర్పంచ్‌ తిరుపతి, పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు.logo