గురువారం 22 అక్టోబర్ 2020
Komarambheem - Oct 18, 2020 , 02:48:46

ముగిసిన జెండా పండుగ వేడుకలు

ముగిసిన జెండా పండుగ వేడుకలు

ఆసిఫాబాద్‌ : మాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి జరుగుతున్న జెండా పండుగ వేడుకలు ముగిసినట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు నగోసే శంకర్‌ తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఆదిలాబాద్‌ క్రాస్‌ రోడ్డు వద్ద జ్యోతి బాఫూలే విగ్రహానికి శనివారం పూలమాల వే సి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మెంగాజీ, బాబురావు, వాసు, సోమేశ్వర్‌, సుధాకర్‌, తిరుపతి, పోచయ్య, బిక్కు, మారుతి, నరసింహ, విజయ్‌ పాల్గొన్నారు.

కెరమెరి : మండలంలోని జ్యోతినగర్‌ గ్రామంలో మాలీ కులస్తుల ఆధ్వర్యంలో గ్రామపెద్ద బెండారే వార్లు జెండాను ఆవిష్కరించారు. అనంతరం సర్పంచ్‌ కుమ్రం నాణేశ్వర్‌ జ్యోతి బాఫూలే దంపతుల చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ పటేల్‌ ఆదే మనోహర్‌, నాయకులు దసరాం, గుర్నులే శంకర్‌  పాల్గొన్నారు.


logo