శనివారం 05 డిసెంబర్ 2020
Komarambheem - Oct 18, 2020 , 02:34:11

ధరిణి పోర్టల్‌పై అధికారులకు అవగాహన

ధరిణి పోర్టల్‌పై అధికారులకు అవగాహన

కుమ్రం భీం ఆసీఫాబాద్‌, నమస్తే తెలంగాణ : ధరణి పోర్టల్‌ దసరా నుంచి ప్రారంభించేందుకు  ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ వీడి యో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. ఈ నెల 19న తహసీల్దార్లకు ధరణి పోర్టల్‌ నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం ధరణి పోర్టల్‌పై అధికారులకు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ప్రొజెక్టర్‌ ద్వారా అవగాహన కల్పించారు. జిల్లాలోని 15 మండలాల తహసీల్దార్లు  ధరణి పోర్టల్‌ని పూర్తిస్థాయిలో వినియోగించేలా శిక్ష ణ ఇచ్చారు. రిజిస్ట్రేషన్లలో ఎలాంటి తప్పులు జరుగకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నెట్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవడం, వృత్తి నైపుణ్యం కలిగిన ఆపరేటర్లను నియమించడం లాంటి చర్యలు తీసుకోవాలన్నారు.