సోమవారం 30 నవంబర్ 2020
Komarambheem - Oct 17, 2020 , 02:37:22

సంప్రదాయబద్ధంగా భీం వర్ధంతి

సంప్రదాయబద్ధంగా భీం వర్ధంతి

  • n   ఆసిఫాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి
  • n   జోడెఘాట్‌లో పీవో భవేశ్‌మిశ్రా,       ఏఎస్పీ సుధీంద్రతో కలిసి సమీక్ష

కెరమెరి : ఈ నెల 31న కుమ్రం భీం వర్ధంతిని సంప్రదాయ బద్ధంగా నిర్వహించుకుందామని జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు. ఐటీడీఏ పీవో భవేశ్‌మిశ్రా, ఏఎస్పీ సుధీంద్రతో కలిసి శుక్రవారం జోడెఘాట్‌ గ్రామంలో పర్యటించారు. భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భీం ఖ్యా తిని ప్రపంచస్థాయికి చాటేలా సీఎం కేసీఆర్‌ పర్యాటకంగా అభివృద్ధి చేశారన్నారు. ఇక్కడ గెస్ట్‌హౌస్‌తో పాటు క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఆదివాసీ యువతకు ఉపాధి కలిగేలా చూడాలని అధికారులకు సూచించారు. కొవిడ్‌-19 కారణంగా ఈసారి దర్బార్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడికి వచ్చే ప్రజలకు తాగునీరు, భోజన, ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తులకు త్వరలోనే డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. స్థానిక యువకులనే స్మారక మ్యూజియంలో సెక్యూరిటీ గార్డులుగా నియమించాలని, కెరమెరిలోని పురాతన జీసీసీ భవనంలో షా పింగ్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేసి ఆదివాసీలకు అప్పగించాలని కోరుతూ ఆదివాసీ నాయకుడు ఆత్రం లక్ష్మణ్‌రావ్‌ సభ దృ ష్టికి తీసుకొచ్చారు. అనంతరం పీవో భవేశ్‌ మిశ్రా మాట్లాడు తూ వర్ధంతి విషయాలపై వచ్చే వారం కలెక్టర్‌తో మరోసారి సమావేశమై  విజయవంతం చేసేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాల ని డీటీడీవోకు సూచించారు. ఏఎస్పీ సుధీంద్ర మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో కుమ్రం భీం మనమడు సోనేరావ్‌, డీటీడీవో దిలీప్‌ కుమార్‌, డీఎస్పీ అచ్చేశ్వర్‌రావ్‌, డీఆర్డీవో వెంకట శైలేశ్‌, సీఐ సుధాకర్‌, జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి, ఎంపీపీ పేందోర్‌ మోతీరాం, తహసీల్దార్‌ సంతోష్‌కుమార్‌, ఎంపీడీవో మహేందర్‌, ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ నాయకులు, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.