బుధవారం 28 అక్టోబర్ 2020
Komarambheem - Sep 28, 2020 , 02:29:16

కొండా సేవలు మరువలేనివి

కొండా సేవలు మరువలేనివి

నిర్మల్‌ అర్బన్‌ :  కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు మ రువలేనివని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఆదివారం బాపూజీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట బా పూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బా పూజీ తొలి, మలిదశ ఉద్యమాలకు అం డగా నిలిచిన ఉద్యమకారుడని కొనియాడారు. న్యా యవాదిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, బడుగు బలహీనవర్గాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివన్నా రు. లెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూ ఖీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, వైస్‌ చైర్మన్‌ సాజీద్‌, కౌన్సిలర్లు, పద్మశాలీ కుల సంఘ సభ్యు లు, జిల్లా నాయకులు ఉన్నారు. 

ఆదర్శంగా తీసుకోవాలి

ఆసిఫాబాద్‌ టౌన్‌ :  కొండా లక్ష్మణ్‌ బాపూజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం  నిర్వహించిన జయంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీ పీ అరిగెల మల్లికార్జున్‌ యాదవ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సత్యనారాయణ, వసతి గృహ సంక్షేమ అధికారి మధూకర్‌, పద్మశాలీ సం క్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. 

ఆశయ సాధనకు కృషి చేయాలి
హాజీపూర్‌ : తెలంగాణ రాష్ట్ర సాధనకు పాటుపడిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్వంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వె నుకబడిన తరగతుల జిల్లా అధికారి ఖాజా న  జీం అలీ అఫ్సర్‌ అలీ, డీపీఆర్వో వై సంపత్‌ కు మార్‌, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి సురేశ్‌, బీసీ సంఘం నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo