సోమవారం 30 నవంబర్ 2020
Komarambheem - Sep 26, 2020 , 02:07:02

మెరుగైన సేవలు అందించాలి

మెరుగైన సేవలు అందించాలి

  •  రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్‌ రాజేశం ఆసిఫాబాద్‌  సీహెచ్‌సీ సందర్శన

ఆసిఫాబాద్‌ టౌన్‌ : రోగులకు మెరుగైన సేవలు అందించాలని కొవిడ్‌-19 రాష్ట్ర పరిశీలకుడు, టీబీ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేశం అన్నారు. జిల్లా కేంద్రంలోని సీహెచ్‌సీ, కరోనా వైరస్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను శుక్రవారం పరిశీలించారు. పరీక్షల వివరాలు, కొవిడ్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను డీఎంహెచ్‌వో కుమ్రం బాలును అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు సత్యనారాయణ, కాత్యాయని, ల్యాబ్‌ టెక్నీషియన్‌ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. 

ఇంద్రవెల్లి : స్థానిక పీహెచ్‌సీని శుక్రవారం కొవిడ్‌-19 బృం దం డీపీవో రవీందర్‌, రాజేందర్‌ శుక్రవారం తనిఖీ చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్‌ కేసుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. సీజనల్‌ వ్యాధులతో పాటు కరోనా వైరస్‌ విజృంభించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యుడు శ్రీకాంత్‌, వైద్య సిబ్బంది జాదవ్‌ శ్రీనివాస్‌, కవిత, తదితరులు పాల్గొన్నారు.

తాండూర్‌ :  స్థానిక పీహెచ్‌సీని రాష్ట్ర స్పెషల్‌ టీం సభ్యులు తనిఖీ చేశారు. రికార్డులు, వార్డులు, శుభ్రతను పరిశీలించారు. కరోనా పరీక్షలు, పాజిటివ్‌ కేసులు, వారికి అందిస్తు న్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ రాష్ట్ర బృందం ప్రత్యేకాధికారి సూర్యశ్రీ, డిఫ్యూటీ డీఎంహెచ్‌వో విజయపూర్ణిమ, వైద్యుడు కుమారస్వామి, సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు ఉన్నారు.

రెబ్బెన : స్థానిక పీహెచ్‌సీని కొవిడ్‌-19 పర్యవేక్షణ రాష్ట్ర బృందం డాక్టర్లు జాన్‌బాబు (ఎన్‌ఎల్‌ఈపీ జాయింట్‌ డైరెక్టర్‌), నాగరాజు (ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్‌) సందర్శించారు. రిజిస్టర్లు పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్‌, డాక్టర్‌ భరత్‌, సిబ్బంది ఉన్నారు.