మంగళవారం 27 అక్టోబర్ 2020
Komarambheem - Sep 23, 2020 , 01:56:37

మౌలిక వసతుల కల్పనే లక్ష్యం

మౌలిక వసతుల కల్పనే లక్ష్యం

  • మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌

కాగజ్‌నగర్‌ టౌన్‌ : పట్టణంలోని 30 వార్డు లల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ము న్సిపల్‌ పాలకవర్గం కృషి చేస్తున్నదని మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ పేర్కొన్నారు. మంగళవారం నౌగాం బస్తీ 27వ వార్డులో క ల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కల్వర్టు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, వార్డు కౌన్సిలర్‌ సుజాత, ఏఈ సతీశ్‌, తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్‌లోనే కూరగాయలు విక్రయించాలి 

 పట్టణంలోని ఇందిరా మార్కెట్‌లోనే వ్యాపారులు కూరగాయల విక్రయాలను చేపట్టాలని మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ సూచించారు. ఆయన మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌తో కలిసి మార్కెట్‌ను పరిశీలించారు. ఇంది రా మార్కెట్‌లోని షెడ్లలోనే విక్రయాలు చేపట్టాలని సూచించారు. రోడ్లపై విక్రయాలు చేస్తే రూ.2 వేల జరిమానా విధించనున్నట్లు వ్యా పారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఏఈ సతీశ్‌, బంగారు శ్రీనివాస్‌, శరత్‌, తదితరులు పాల్గొన్నారు. logo