బుధవారం 28 అక్టోబర్ 2020
Komarambheem - Sep 22, 2020 , 02:14:42

సమన్వయంతో పని చేయాలి

 సమన్వయంతో పని చేయాలి

  •  ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ 

ఆసిఫాబాద్‌ టౌన్‌ : అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్సీ సతీశ్‌, జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మితో కలిసి హాజరయ్యారు. జిల్లాలోని అన్ని మండల పరిషత్‌ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉత్తమ అవార్డు గ్రహీతలకు ప్రశంసా పత్రాలను అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థలలో ఎల్లవేళలా కృషి చేస్తున్న అధికారులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, జడ్పీ సీఈవో వేణు, డిప్యూటీ సీఈవో సాయి గౌడ్‌, సూపరింటెండెంట్‌ తోటాజీ, మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. 


logo