శనివారం 05 డిసెంబర్ 2020
Komarambheem - Sep 21, 2020 , 01:34:38

నేటి నుంచి డిగ్రీ పరీక్షలు

నేటి నుంచి డిగ్రీ పరీక్షలు

మంచిర్యాల అగ్రికల్చర్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో సోమవారం నుంచి ఫైనలియర్‌ విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల, లక్షెట్టిపేట, బెల్లంపల్లి, చెన్నూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు జిల్లాలోని రెండు గురుకులాలు, 20 ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో కలిపి మొత్తం 4,952 మంది విద్యార్థులు ఉన్నారు. కొవిడ్‌-19 దృష్ట్యా అధికారుల ఆదేశాల మేరకు సెల్ఫ్‌ సెంటర్లలో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఒక్కో గదిలో 20 మంది, బెంచీకి ఒక్కరు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులు, జ్వరం, అనార్యోగంతో ఉన్న వారి కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా పరీక్ష ఉంటుందని, 9:30 గంటలకే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి విద్యార్తి మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. పరీక్ష పరీక్షకు మధ్యలో గదిలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయనున్నారు. పరీక్షా కేంద్రానికి ఒక అబ్జర్వర్‌తో పాటు ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందం పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు.