మంగళవారం 27 అక్టోబర్ 2020
Komarambheem - Sep 20, 2020 , 03:00:27

రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి

రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి

  • n కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం  కో ఆర్డినేటర్‌ రాజేశ్వర్‌ నాయక్‌ 
  • n వరి, పంటల పరిశీలన

హాజీపూర్‌ : వరిలో సుడి దోమ ఆశించే అవకాశం ఉన్నందున రైతులు పురుగు ఉధృతిని గమనిస్తూ యాజమాన్య పద్ధతుల ను పాటించాలని కృషి విజ్ఞాన కేంద్రం ప్రో గ్రాం కోఆర్డినేటర్‌ రాజేశ్వర్‌ నాయక్‌ సూచించారు. బుద్దిపెల్లి, కొండాపూర్‌ గ్రా మాల్లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం, మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్వంలో శనివారం క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు. వరి పైరు ను ఆశిస్తున్న చీడ పీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు.  ఇందులో శాస్త్రవేత్తలు శివకృష్ణ,నాగరాజు, మండల వ్యవసాయ అధికారి రజిత, విస్తరణ అధికారి కనుకరాజు, రైతులు పాల్గొన్నారు.

దండేపల్లి(లక్షెట్టిపేట రూరల్‌) : కృషి విజ్ఞా న కేంద్రం-బెల్లంపల్లి  వ్యవసాయ శాఖ ఆ ధ్వర్యంలో మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రా మంలో అధికారులు క్షేత్ర సందర్శన చేపట్టా రు. ఈ సందర్భంగా కేవీకే కోఆర్డినేటర్‌ రాజేశ్వర్‌నాయక్‌ ప్రస్తుత పరిస్థితుల్లో పత్తిలో ఆశిస్తున్న చీడపీడలపై రైతులకు అవగాహన కల్పించారు. లద్దె పురుగు, తామర పురుగు ఆశించే అవకాశం ఉన్నందున నివారణకు లీటర్‌ నీటికి 2మి.లీ. ఫిఫ్రోనిల్‌ మందును పిచికారీ చేసుకోవాలన్నారు. ఇందులో కేవీకే శాస్త్రవేత్తలు శివకృష్ణ, నాగరాజు, మండల వ్యవసాయాధికారి ప్రభాకర్‌, రైతులు, తది తరులు ఉన్నారు.logo